ప్రకృతి:-స్వాతి,10వ, తరగతి,ZPHS దుప్పల్లి.

 ప్రకృతి మనకు ఇచ్చే ప్రతీది
ఓ అద్భుతం 
కాలానుగుణంగా తననుతానే మార్చుకుంటూ
మనకవసరమైనవన్ని మనకందించే తల్లి ప్రకృతి
ఎండల వేడిమికి చెట్లన్నీ ఎండిపోతున్నవేళ
మా ఇంటిముందు వేపచెట్టేమో కొత్తపెళ్ళికూతురులా ముస్తాబైంది
పచ్చగా మారి మాకు చల్లని నీడనిస్తుంది
ఎండను మరిపిస్తుంది
మామిడి చెట్టైతే తన ఫలాలను అందిస్తూ వగరు తీపి పుల్లని రకాలుగా రసాలనందిస్తూ నోరూరుస్తోంది
జామచెట్టైతే జామపళ్ళను తినిపిస్తూ జాలిగా ఎండను తరుముతున్నది
పుచ్చకాయలైతే కడుపును చల్లబరుస్తూ మాకు ఓదార్పునిస్తున్నవి
వడదెబ్బకు చక్కటి ఔషధం
కొబ్బరిబొండాం 
కొబ్బరి నీళ్ళు తాగితేచాలు కొత్తశక్తి మనకొస్తది
కాలమెంత మారిన కాలానుగుణంగా ప్రకృతి మనకిచ్చే ఔషధాలు చాలు కాలాన్నలా గడిపేందుకు