గుండెధైర్యం:-యం. సింహాద్రి,10, తరగతి,దుప్పల్లి.

 సైనికుడు ధైర్యాన్ని నింపుకుని
దేశ శౌర్యాన్ని తనువంతా కప్పుకుని
శత్రుమూకలను పౌరుషంతో తరుమి
ఉరుమై మెరుపై పగలు రాత్రి
చైతన్య సూర్యుడై నిలబడతాడు
మన కలలకు కాపలాదారుడు
చావుకెదురెల్లె తెగువున్నోడు
ఏదేమైనా అతడే మనం 
అతని సేవకు ఏమిచ్చిన తక్కువ
గౌరవించాలందరం సైనికున్నెపుడు
అతడెపుడు ఆకాశమంత ఎత్తు