*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౩౭ - 37)

 కందము :
*మగమీనమువై జలధిని*
*పగతుని సోమకుని జంపి | పద్మభవునకు*
*న్నిగమముల దెచ్చి యిచ్చితి*
*సుగుణాకర! మేలు | దివ్యసుందర కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
మంచి సుగుణాలను అలంకారముగా కలిగిన వాడవైన కృష్ణా!!! బ్రహ్మ వద్దనుండి వేదములు దొంగిలించి, సోమకాసురుడు సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు, నీవు అందమైన మగ చేపగా మారి, ఆ సోమకుని చంపి, వేదాలను బ్రహ్మ కు తిరిగి ఇచ్చావు. నీ లీలా విలాసము, అనన్య సామాన్యము కదా! కృష్ణా!!......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss