*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౩౯ - 39)

 కందము :
*ఆదివరాహుఁడవయి నీ*
*వా దనుజ హిరణ్యనేత్రు | హతుజేసి తగన్*
*మోదమున సురలు పొగడఁగ*
*మేదిని గిరి గొడుగెత్తి | మెరసితి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
కృష్ణా! నీ లీలావతారములలో వరాహవతారము చక్కని అందమైన అవతారము.  హిరణ్యాక్షుడు అను రాక్షస రాజు ఈ భువిపై దండయాత్ర చేసి, భూమిని తనతోపాటు రసాతలంలో కి తీసుకెళ్ళి అక్కడ ఆమెను బందీగా వుంచుతాడు.  నీవు వరాహావతారము ఎత్తి, నీ పదునైన కోరలతో ఆతనిని చంపి, మరల భూమిని తన స్థానములో వుంచావు.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss