శ్రీ కృష్ణ శతకము - పద్యం (౪౧ - 41)

 కందము :
*వడుఁగుడవై మూడఁడుగుల*
*నడిగితివౌ భళిర భళిర | యఖిల జగంబుల్*
*తొడిగితివి నీదు మేనున*
*గడుచిత్రము నీ చరిత్ర | ఘనమవు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
చిన్న పిల్లవాడిగా, గొడుగు పట్టకుని వటువుగా మారి, బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి, మూడడగుల నేల దానంగా అడిగి, ఆ మూడడుగుల కొలత నీ శరీరం తో నే కొలిచి, జగమంతటినీ నీ శరీరం నిండా నింపుకున్నావు. ఇది ఎంత సభ్రమాశ్చర్యాలు కలిగించే విషయం. ఎంతో ఘనతరమైన విషయం. చివరికి బలి చక్రవర్తిని కూడా తుద ముట్టించావు......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధూ, నీ భక్తులను రక్షించడానికి, ధర్మరక్షణార్ధం నీవు ఎత్తిన అవతారాలు లెక్కకు మిక్కిలి అయినా మా మానవాళికి నిత్య ఆకలి కదా, పరపాత్పరా!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss