శ్రీ కృష్ణ శతకము - పద్యం (౪౪ - 44)

 కందము :
*ఘనులగు ధేనుక ముష్టిక* *దనుజుల చెండాడితౌర | తగ భుజశక్తిన్*
*అనఘాత్మ! రేవతీపతి*
*యనఁగ బలరామమూర్తి | వైతివి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
పరపాత్పరా, ఎంతో గొప్ప భుజ బలము వున్న నీవు, ధేనుకుడు, ముష్టికుడు అను రాక్షసులను చంపివేసావు.  రేవతీ దేవికి భర్తవై బలరాముని అవతారము ధరించావు కదా ఆత్మేశ్వరా!...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధూ, నీవు సృష్టించిన ఈ లోకాలను కాపాడడానికి నీ భుజ బలముతో ఎంతమంది రాక్షసులను సంహరించావో కదా! దనుజవైరీ*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు