శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౪౬ - 46)

 కందము :
*వలపులతేజీ నెక్కియు*
*నిలపై ధర్మంబు నిలుప | హీనుల దునుమన్*
*కలియుగము తుదిని వేడుకఁ*
*కలికివిగా నున్న లోక | కర్తవు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఎంతో అందమైన గుర్రమును ఎక్కి, దుష్టులను సంహరించి, ఈ భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి కలియుగాంతములో కలికిగా అవతారమెత్తి వచ్చేది నీవే కదా, కృష్ణా...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మహానుభావా, కరుణాసింధో, ఇన్ని అవతారములు ఎత్తి ఈ భూమిమీద ధర్మ సంస్థాపన చేసావు.  కానీ అధర్మం రాజ్యమేలే ఇప్పటి కలియుగంలో ధర్మ సంరక్షణ కోసం కలికి అవతారము గా వచ్చేది నీవే కృష్ణా*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు