కందము :
*హరి! నీవే దిక్కు నాకును*
*సిరితో నేతెంచి మకరి | శిక్షించి దయన్*
*బరమేష్టి సురలు బొగడఁగ*
*కరిగాచినరీతి నన్ను | గావుము కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
లక్ష్మీ దేవితో కలసి వచ్చి మొసలి నుండి ఏనుగుకాపాడావు కదా, అలాగే న్ను కూడా కాపాడు దేవకీ నందనా. నాకు నీవే దిక్కు. నీవు తప్ప వేరొకరు లేరు కృష్ణా!!! ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*పూతన ప్రాణహరణా కృష్ణా!!! "ఖగరాజు ని ఆనతి విని వేగ చనలేదో! గగనానికి ఇలకూ బహుదూరం బనినావో! జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదూ" గజరాజు చేసిన ఆర్తితో కూడిన ప్రార్థన విని, లక్ష్మీ దేవి చేలము నీ చేతిలో వున్న విషయం కూడా మరచి, మొసలి నుండి గజరాజు ను రక్షించావు కదా, సర్వేశ్వరా. మేము ఇక్కడ ప్రతిక్షణమూ లెక్కలేనన్ని మొసళ్ళతో బాధింప బడుతున్నాము. మాకు గజరాజు లాగా ఆర్తితో ప్రార్ధించటం రాదు. మనసు నిలువదు. మా పిలుపులో ఆర్తిని నీవే నింపి, మమ్మల్ని రక్షించాలి, రుక్మిణీ వల్లభా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి