*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౫౪ - 54)

 కందము :
*కుంభీంద్రవరద, కేశవ*
*జంభాసురవైరి, దివిజ | సన్నుత చరతా*
*అంభోజనేత్ర, జలనిధి*
*గంభీరా, నన్ను గావు | కరుణను కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
 గజరాజును కాపాడిన వాడా, కేశి, జంభాసుర అనే రాక్షసులను సంహరించినవాడా, దేవతల చేత పొగడబడిన నడవడిక కలవాడా, తామర పూవుల వంటి కన్నులు కలవాడా,  సముద్రమంత గంభీరమైన మనసు కలవాడా, నీవు తప్ప వేరెవరూ దిక్కులేరు, కరుణచూపించి నన్ను కాపాడు కృష్ణా!!! ......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss