*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౫౬ - 56)

 కందము :
*పురుషోత్తమ లక్ష్మీపతి*
*సరసిజ గర్భాదిమౌని | సన్నుత చరితా*
*మురభంజన సురరంజన*
*వరదుఁడవగు నాకు భక్త | వత్సల కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
జీవులలొ ఉత్తమమైన వాడవు. భక్తులయందు దయ, కరుణ కలిగిన వాడవు.  లక్ష్మీ దేవికి భర్తగా వున్నవాడవు.  బ్రహ్మ మొదలగు మునుల చేత పొగడబడిన నడవడిక గలవాడవు.  మురుడనే రాక్షసుని వధించినవాడవు.  దేవతలకు సంతోషము కలిగించేవాడవు.   ఇంతటి నీవు నాకు కూడా దయతలచి, వరములిచ్చి, కాపాడు , వసుదేవనందనా.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ఈ సర్వ జగత్తునూ నీ కరుణతో, దయతో చల్లగా కాపాడుతున్న ఓ! కృష్ణమూర్తి, నీయందు నా చిత్తము నిలుపలేని చంచల చిత్తము కలవాడను, అపరాధిని.  నాయందు దయచూపి, నీ కరుణా రస దృక్కులతో నీలో, నీవే కలుపుకోవా స్వామీ, భద్రరాజ వరదా..."*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss