*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౫౭ - 57)

 కందము :
*క్రతువులు తీర్ధాగమములు*
*వ్రతములు దానములు సేయ | వలెనా? లక్ష్మీ*
*పతి! మిము దలఁచినవారికి*
*నతులిత పుణ్యములు గలుగు | టరుదా కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ లక్ష్మీ రమణ,  వేదములు చదవడం వలన, యజ్ఞములు చేయడం వలన, నీ పూజలు, దానములు చేయుట వలన  మానవులకు ఎంతో పుణ్యము  కలుగుతుంది అంటారు కదా మానాధా.  కానీ, నిన్ను తలచుకున్నంత మాత్రమే ఇవన్నీ చేసిన పుణ్యం నీ భక్తలకు దొరుకుతుంటే,  యజ్ఞయాగాదులు, తీర్ధయాత్రలు వంటి కఠినమైన పనులు చేయనవసరం లేదు కదా, కృష్ణా !!!....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*అక్రూరవరదా, సర్వమూ నీ వే అయి వుడగా,  సర్వ క్రతువులకు ఆధార భూతుడవు నీవే అవగా, నిన్ను వదలి, నీ నామస్మరణ మరచి వ్రతాలు, తీర్ధాలు అంటూ తిరగడం అనవసరం ఐన ప్రయత్నం కదా స్వామీ.  నీవే నాకు దిక్కు సర్వ రక్షకా! ఆంజనేయ వరదా!!..."*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss