ఆకుల ఎరువు:-ఎర్రయ్య గారి హర్షిక -6వ, తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి:9704865816
ఎండాకాలం రాగానే
చెట్ల ఆకులు రాలును
ఆకులు కాల పెట్టినచో
గాలి కాలుష్య మౌను
మనుషులకు రోగాలువచ్చును
ఆరోగ్యం పాడైపోవును
అందుకే మనము 
ఆకులు తట్టల ఎత్తాలి
గుంతలోనే పోయాలి 
ఆకులు అన్ని మురుగుతాయి 
ఎరువు తయారవుతుంది
బస్తాలల్లో నింపుకొని
పొలములోన వేయాలి
పంటలు బాగా పండును
రైతు సంబుర పడును.