తమ్ముడు:-యం.లోకేశ్-7వ,తరగతి-ZPHS గుర్రాలగొంది--జిల్లా సిద్ధిపేట--చరవాణి:9704865816

 తమ్ముడమ్మ తమ్ముడు 
మా మంచి తమ్ముడు 
అమ్మ చెప్పిన పనులను
అసలేజేయడు
మా తమ్ముడి పేరు 
మనీషు గాడు
మంచిపని ఒక్కటి చేయడు 
పంది లెక్క తింటడు
సోమరిగా పంటడు. 
సోకులెక్కువపడుతడు
పక్కోళ్లను ఏడిపిస్తడు.
సైకిలు పట్టుక ఆడుతాడు
బడికసలే వెళ్లడు
ఉపాధ్యాయుడుఇచ్చినపని
ఇంటికి పోయి చేయడు.
ఏమైన దోస్తులతో
ఆటలాడుతుంటడు.
కబడ్డి,కోకో,చారుపత్త, 
ఉప్పు బొంద,అష్టచెమ్మ
అన్నిఆటలాడుతాడు
అలిసి పోయి పంటడు
తమ్ముడంటె తమ్ముడు
తలతిక్క తమ్ముడు.