చిలుకమ్మ:-పడిగె భావన 7వ,తరగతి -ZPHS గుర్రాలగొంది -జిల్లా సిద్దిపేట-చరవాణి:9704865816

కొబ్బరి చెట్టు తొర్రలో
చిలుకమ్మ ఉన్నది 
ఆకలి బాగా అవుతుంది 
జామ తోటకు వెళ్ళింది 
జామ పండ్లు చూసింది 
పొట్టి ఎర్ర ముక్కుతో
పొడుచుకుంటూ తిన్నది
నాకు ఒక్కటిచ్చింది 
స్నేహమేమొ చేసింది 
మా ఇంటి పంజరంలో 
తలదాచు కున్నది 
నా స్నేహితులందరికి
జాతకము చూసింది 
మంచిచెడ్డలు చెప్పింది
అందరము కలిసినాము
*చిట్టి*  అని పేరు పెట్టాము 
చిట్టి చిట్టి యంటుంటే
మా మీద వాలిపోయింది 
మాలో కలిసిపోయింది.