పక్షులమ్మ పక్షులు
రకరకాల పక్షులు
చెట్లమీద ఉంటాయి
పుల్ల లేరు కొస్తాయి
గూడు కట్టుకుంటాయి
పండ్ల చెట్లు చూస్తాయి
పండ్లు కొరికి తింటాయి
కడుపునింపు కుంటాయి
పక్షులమ్మ పక్షులు
అందమైన పక్షులు
గూటిలోన గుడ్లు పెట్టి
పిల్లలను చేస్తాయి
రెక్కల కింద దాచుకుని
పెంచిపెద్ద చేస్తాయి
పిల్లలారా మీరు
పక్షులను కొట్టకండి
వాటిని స్నేహితులు లాగా
చూసి ఆనందించాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి