బంతి పూలు (బాల గేయం): -పిడపర్తి అనితాగిరి -సిద్దిపేట-7330885931

మా ఇంటి ఇంతి
మా పూ బంతి

ఉదయాన్నే లేచింది
ఇల్లు వాకిలి ఊడ్చింది
కళ్లాపి చల్లింది
చక్కగా ముగ్గులు పెట్టింది

మా ఇంటి ఇంతి
మా పూ బంతి 

గుమ్మానికి పసుపు రాసింది
కుంకుమ బొట్లు పెట్టింది
చక్కగా అలంకరించింది
చూసి ఎంతో మురిసింది

మా ఇంటి ఇంతి
మా పూ బంతి

బంతి తోటకి వెళ్ళింది
ముద్దబంతులు తెంపింది
బుట్ట నేమో నింపింది
ఇంటికి తిరిగి వచ్చింది

మా ఇంటి ఇంతి
మా పూ బంతి

దండలు తయారు చేసింది
గుమ్మాలకు అలంకరించింది
ఇంటికి అందం వచ్చింది
అది చూసి ఆమె మురిసింది

మా ఇంటి ఇంతి 
మా పూబంతి.