ఎవరెస్టు శిఖరం:-కొంగరి అభిషేక్-8వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -జక్కాపూర్ సిద్దిపేట జిల్లా -సెల్ 9014 6330 80

 మనం జీవించే ప్రతి క్షణం 
అమ్మ పెట్టిన భిక్ష
గుడి లేని దైవం అమ్మ 
మనం పీల్చుకునే శ్వాస 
మనం నడిచే నేల 
అమ్మ ఇచ్చిన వరాలు
మన తప్పులు సరిదిద్దు అమ్మ
 అమ్మ ..అమ్మ ..అమ్మ ..
అమ్మ ప్రేమ ఎవరెస్టు శిఖరం
ఆనందమైన అనురాగం అమ్మ
 కొండంత ధైర్యం అమ్మ 
అమ్మ దీవెన చల్లని దీవెన 
దేవుని యొక్క వరం అమ్మ
అందమైన పదం అమ్మ 
జోల పాట పాడి 
ఉయ్యాల ఊపేది అమ్మ 
లాలి పాట పాడి 
నిద్రపుచ్చేది అమ్మ .