గ్లామర్ బండి:--తోకలదివ్య-8వ, తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816

 మాకు ఉన్నది గ్లామర్ బండి
అందమైనది ఆ బండి 
చూడగానే కళ్ళకు 
మిరిమిట్లు గొలుపును
ఇద్దరెక్కి పోయిన 
చక్కగాను చేరును
నలుగురెక్కి నడిపిన 
నడుము విరుగ పడుదురు
స్పీడు బ్రేకర్ ఉన్నచో 
చూసి ముందుకు నడుపుము
హెల్మెట్ పెట్టకున్న
ప్రమాదాలుజరుగును
నిత్యము వెళ్లెటపుడు
హెల్మెట్టు పెట్టుకొనుము
క్షేమంగా ఇంటికి వెళ్లుము
లైసెన్సు లేకుంటే 
బండి పట్టుకుంటారు
బండి నడిపేటప్పుడు 
జాగ్రత్తలు పాటించుము.

కామెంట్‌లు