గుడి:-బెజుగాం అర్చన-8వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా: సిద్ధిపేట-చరవాణి:9704865816

 సూర్యుడు ఉదయించక ముందె
నిద్దుర నేను లేచాను
వాకిలి అంతా ఊడ్చాను 
సానుపు చక్కగ చల్లాను
చుక్కల ముగ్గులు వేసాను
రంగులు అన్నీనింపాను
ఇల్లు శుభ్రం చేసి
తలంటు స్నానం చేశాను
కొత్తబట్టలు కట్టాను
గుడికి నేను వెళ్లాను
ప్రసాదమంతా పంచేసి
తిరిగి ఇంటికి వచ్చాను
చక్కగ చదువు చదివాను.

కామెంట్‌లు