బొమ్మల పెళ్లి :-దండ్ల ప్రవళిక -8వ తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి:9704865816

 ఆటలండి ఆటలు 
చిన్న పిల్లల ఆటలు 
బొమ్మల పెళ్లి చక్కగా 
ఆడుతారు పిల్లలు 
కూరాళ్లు,ఐరేండ్లు 
పట్టి తీసుకువస్తారు 
బొమ్మలను తయారు చేసి 
పెళ్లి పందిట్లో తీసుకొస్తారు
పంతులుతో మంత్రాలు 
అన్నీ చదివిస్తారు 
జీలకర్ర బెల్లము
తలపైన పెట్టిస్తారు
తాళిబొట్టు కట్టిస్తారు 
వంటలనన్ని వండిస్తారు 
చెట్ల ఆకులు తెంపుకవస్తారు
భోజనాలు అందరికి పెట్టిస్తారు 
పెళ్ళికొడుకు పిల్లతో 
ఫోటోలు దిగుతారు 
పెళ్లి పిల్లతో కడప
కడిగిస్తారు
అత్తగారింటికి 
అమ్మాయిని పంపుతారు
సెలవులు వచ్చినప్పుడు
ఇలాంటి ఆటలు ఆడుతారు