సెల్ ఫోన్( గేయం):---తోకల దివ్య 8వ, తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి 9704865816

 సెల్లు ఫోను చూడరా
అందముగా నుండురా
సిమ్ము కార్డు మెమరీ కార్డు 
అందులోన వేయరా 
పాటలు గేములు అన్ని 
పాడుకుంటూ ఆడవచ్చు 
దూరమున్న బంధువుల
క్షేమాలు అడుగవచ్చు 
టీ-స్యాట్ లో పాఠములు 
రోజువచ్చు చుండెను
కరోనా ఉన్నంతసేపు
సెల్ ఫోను వాడాలి
బడి తెరువగానే మనము
సెల్లుబందుచేయాలి
సెల్లుకు బానిసైతె
చెవుడు మనకు వస్తుంది
సెల్లు లోన ఆటలాడితె
కండ్లు పాడై పోతాయి
సెల్లు తోటి కొద్దిసేపు 
రోజు ఆడుకోవాలి 
మంచి మంచి విషయాలు 
మనమునేర్చుకోవాలి.