సర్కార్రు బడుల్లో చదివే విద్యార్థులలొనే ప్రతిభ సామర్థ్యములు అధికంగా ఉంటాయని,ప్రభుత్వ పాఠశాల లను అభివృద్ధి చేయడానికి దాతలు కృషి చేయాలని ,పిల్లల సమగ్ర వికాసంలో చదువుతో పాటు సాహిత్యం, ఆటలు ప్రధాన భూమిక పోషిస్తాయని అక్షర వనం వ్యవస్థాపకులు ఎడ్మ మాధవరెడ్డి అన్నారు.
ప్రభుత్వ గ్రామీణ, పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించాలనే సదుధ్యేశ్యం తో సుగుణ సాహితి సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో డా.మొసర్ల జానకి-మాధవరెడ్డి గార్లు తేదీ.15 మార్చ్, 2021 సోమవారం రోజున నారాయణరావుపేట మండలం లోని జక్కాపూర్ ఉన్నత పాఠశాల కు చెందిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల విలువ గల టేబుల్, కుర్చీ,టేబుల్ ఫ్యాన్,స్టడీ లైట్ లు మరియు క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 5 గురు విద్యార్థులకు 2 వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు బహుకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య, మండల విద్యాధికారి యాదవరెడ్డి, విద్యావేత్త వాసు మోజేటి సర్పంచ్ దుర్గం పర్శరాములు, ఉప సర్పంచ్ కనకాంబరం,
సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య,సూర్యప్రకాశ్, కోడి రమేష్ ,ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి