నక్కకేమొ ఒక్కనాడు
మిక్కిలాకలేసెను
తినుటకేమి చిక్కలేదు
తిరిగెను అడవంతట
తిరిగి తిరిగి అడవిలోన
ఊరిలోనికొచ్చెను
ఊరిలోన ఒకపొలములొ ద్రాక్షతోట కన్పట్టెను
తియతీయని ద్రాక్షపళ్ళు
తినుటకొరకు చూసెను
అందలేదు ద్రాక్షగుత్తి
ఎంతగ ప్రయత్నినా
ఎగినాను అందవని
ఎరుక గలిగె ఆనక్కకు
తెలివిగలిగినట్టి నక్క
తిరిగి అడవికెళ్ళెను
తమిత్రులనందరినీ
తీసెకెళ్ళె తోటకి
ఒంగమనెను ఒక నక్కను
దానినడుపైనొకటి
వేరొకటి దానిపైన
మరియొకటి దానిపైన
తానెక్కగ నక్కకపుడు
అందినవా గుత్తులన్ని
తెంపిపోసె పడ్లన్నీ
తినెనుగూడినక్కలతో
తీయనైన ద్రాక్షపండ్లు
అపుడెపుడో మాతాతకు
అందలేదట ద్రాక్షపండ్లు
చింతపడిన మాతాత
ఛీ ఛీ పుల్లన పడ్లనెనట
హేళనచేస్తూ కథలుగ
ఈనాటికి చెప్పుకొంద్రు
ఆలోచన లేకతాత
అందలేకపోయె పండ్లప్పుడు
ఉపాయం గలిగెనేని
ఊళ్ళనె మనమేలవచ్చు
అనుకొనుచూ ఆనక్కా
అరిగెను అడవికి గుంపుతొ
తెలివిగలనక్క(బాలగేయం)-- సత్యవాణి కుంటముక్కుల-8639660566
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి