పల్లె తల్లివంటిది:- సత్యవాణి- 8639660566

 ఆకర్షణ లేకపోయినా
అమ్మ అమ్మే
ఆప్యాయత ఆప్యాయతే
అలిసినపుడు చల్లని నీడనిచ్చి
సేదతీరుస్తుంది
కలిగినదానితో కడుపునింపుతుంది
కలసి మెలసి వుండమని
హితబోధ చేస్తుంది
సకల వృత్తులను స్వాగతిస్తుంది
సమ సమాజమననేమో 
ఆచరణలో చూపిస్తుంది
వేల వేల బిడ్డలనూ
పేరు పేరునా పలుకరిస్తుంది
నేనున్నాను మీకని భరోసా ఇస్తుంది
           పట్టణం 
పట్టణం వారకాంతవంటిది
రంగు రంగుల హొయలు చూపిస్తుంది
రండి రమ్మని ఆకర్షిస్తుంది
రంగుల వలవిసరుతుంది
అడుగడుగునా 
అన్నీ ఆకర్షణలే
అగుపించని అగాధాలే
అడుగడుగునా
అడుసు గుంటలే
ఆకర్షించే సుడిగుండాలే
చిక్కుకుంటే చేయందించే
దిక్కులేదు
ముక్కినామూల్గినా
నవ్వినా ఏడ్చినా
పుట్టినా గిట్టినా
పట్టించుకొనే వాడు లేడు
నీచావు నీది
నీ బ్రతుకు నీది
నన్ను నేనే ఎరుగను
నిన్ను నేనేమెరుగుదును
అంటుందిపట్నం
అందుకే
పల్లె తల్లి వంటీది
పట్టణం
వారకాంతవంటిది