*జాతీయపతాక రూపకర్త*:-అయిత అనిత-8985348424జగిత్యాల
దేశభక్తిని మదినిండా 
ఒంపుకున్న భారతీయుడు!
స్వాతంత్ర సముపార్జనే లక్ష్యంగా
 సాగిన ధీరుడు!!

శాంతి త్యాగం సస్యశ్యామలతలకు
 ప్రతీకగా  మువ్వన్నెలను దిద్ది
శౌర్యానికి ప్రతీకగా అశోకచక్రాన్ని అద్ది
రూపొందించెను కేతనం!
స్వాతంత్ర్య సమరంలో అంకుశంగా మారెను
 మన త్రివర్ణపతాకం!!

భూగర్భశాస్త్ర పరిశోధకుడుగా
బహుభాషా కోవిదుడుగా
కీర్తిగడించిన పింగళివెంకయ్య
కరకమలాలు ఆవిష్కరించినదే 
నేడు జాతీయపండుగల్లో 
వినువీధుల్లో రెపరెపలాడే మనజెండా
మన జెండానే మనకు అండ!
అట్టి..మన జెండాకు వందనం!!