కోతులు:-బెజుగాం అర్చన8వ,తరగతిZPHS గుర్రాలగొందిజిల్లా సిద్ధిపేటచరవాణి:9704865816.

 ఆంజనేయుని రూపమే 
ఆ కోతి రూపము
గుంపు గుంపులొస్తయి
అన్ని చెట్లు ఎక్కుతాయి
ఆటలెన్నో ఆడుతాయి 
కొమ్మలిరుగ కొట్టుతాయి
పండ్లనన్ని తెంపుతాయి
అడవులన్ని నరుకుతుంటె
కోతులకు కరువు వచ్చెను 
అడవి దారి విడిచినయి
ఊరు దారి పట్టినయి
ఇండ్లల్ల జొరబడి
దొరికినవి తీసుకెళ్తున్నవి
వెళ్లగొట్టిబోతె మనల
కొరికి,గీకి పెడుతున్నయి
ఖాళి జాగలున్నచోట
చెట్లనన్ని పెంచుదాం 
నరికి వేయకుండ
జాగ్రత్తగా పెంచుదాం 
చెట్లు బాగా పెంచిన
కోతులు వాపస్ పోవును.