వివిధమణిపూసలు:-తోకల నవ్య 9వ, తరగతి-ZPHS గుర్రాలగొందిజిల్లా: సిద్ధిపేటచరవాణి:9704865816.
పిట్ట చిన్న గుండురా 
దాని తెలివి మిన్నరా 
గడ్డిపోసలు తెచ్చుకొని 
ఇల్లు కట్టుకుందిరా

బడి పెద్దగ నుండెను 
చెట్లు చాల నుండెను 
నీళ్లు బాగా పోసిన 
పచ్చదనమ నుండెను

బండేమో ఇష్టము
ప్రాణ మేమొ నష్టము
హెల్మెట్టు ధరించక
వచ్చునేమొ కష్టము

సేంద్రియ ఎరువు వేయండి 
పొలమును దున్నిపించండి
వరి పంటనంత వేసి
ప్రజల ఆకలి తీర్చండి

మా ఊరిలో గుడి ఉంది 
గుడిల దేవత వెలిసింది 
కోరిన కోరికలనన్ని
గుడిల దేవత తీర్చింది.


కామెంట్‌లు