సైనికుడు:-బర్మ సాయికిరణ్-9వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816.

 సైనికుడు గొప్పవాడు
బాడర్ల కాపలా ఉంటాడు 
తన ప్రాణం అడ్డుపెట్టి 
దేశాన్ని రక్షిస్తాడు 
రేయనకా పగలనకా 
కాపలాగా ఉంటాడు 
బాంబులకు భయపడక 
ఎదురునిలిచి నిలబడతాడు 
నీళ్ల యనక బురదయనక 
అందులో పడి ఉంటాడు
కుటుంబం గుర్తుకొస్తే 
చాలా బాధపడతాడు 
చలి యనక ఎండనక 
మంచుకొండల్లోన
దైర్యంగా నిలుస్తాడు.
ప్రాణాలను లెక్కచేయక
నిరంతరం భరతమాత 
సేవకే రక్షణగా నిలుస్తాడు.

కామెంట్‌లు