కరోనా వైరస్:-బండారు బన్ని-9వ,తరగతి-ZPHS:గుర్రాలగొంది-జిల్లా:సిద్ధిపేట-చరవాణి:9704865816

 చైనాలో పుట్టింది 
ప్రపంచమంతతిరిగింది
మన దేశము వచ్చింది 
రాష్ట్రాలు పాకింది
గ్రామాల‌ను చుట్టింది
ఇండ్లలోనె ఉంచింది
బయట తిరుగ వద్దంది
మాస్కులు ధరించుమంది
దూరదూరముండమంది
షానిటైజరు వాడమంది
వ్యాక్సిన్ దొరకనంది
బడికి మమ్ముల రాకుమంది
ఆనులైను పాటమంది
అందరినిచూడమంది
మంచి ఆహారముతినమంది
తిరిగి వెళ్లిపోయింది
మళ్లి బడికి రాగానే
మాతోటే వచ్చింది.
లాకుడౌను చేస్తరని
రందిమాకు పట్టింది
కరోన రోగమురా
అంతమయ్యె దెన్నడురా!!

కామెంట్‌లు