హోళీ నానీలు:-అమృతవల్లి. ఎ--9052912120.
1.ఇష్టమైన సఖుణ్ణి
    ఎంపిక చేసుకునే
    విశిష్ట ఖేళీ
    వసంతాల హేళి..!!
2.ఆదిమ జాతుల్లో
    ఇదో ప్రహేళిక
    ఎవరు ఎవరినైనా
    పొందే భాగ్యం..!!
3.రసమయ
   క్రీడల రంగుల హోళీ
   రాధా మాధవ
   ప్రణయ విహారి..
4.మన్మథుడు సంధించిన
   ఆర్నవాలవి
   తప్పుంచుకోలేని
   తపనలు...
5.మది సంతోషాలకు
    వేదికలు
   మరపురాని
   ప్రణయ చిరునామాలు..
6.సింగిడి వర్ణాలన్నీ
   యువ జంటలకై
   ఇల దిగిన
   కవ్వింపు శోభలు..
7.వసంతానికి
    ఆహ్వానం
    వర్ణ శోభిత ప్రియ
     జంటల దరహాసం..