పల్లవిస్తా:-అమృతవల్లి. ఎ.-9052912120.
నీ కోసం నింగిన మెరిసే వెన్నెల సోనలు
తేలేక పోవచ్చు
నీ కోసం స్వాతిచినుకునై
ముత్యంగా మారలేకనూ పోవచ్చు
నీ కోసం ప్రవాళికల్లో ఎర్రని
పగడమై మెరవలేకనూ  పోవచ్చు
సుదీర్ఘ రాత్రుల్లో ఘనీభవించిన
కంటి చినుకులా మారకనూ  పోవచ్చు
నువ్వు నడిచి వెళ్లిన దారుల్లో
చెరగని పాదముద్రనై నిలువకనూ పోవచ్చు
కానీ...నీవు పంచిన స్నేహపరిమళాన్ని
హత్తుకున్న మది కాన్వాసుపై
మానవత్వపు సంతకాన్ని మాత్రం నిలుపుకుంటా
అక్షర జ్యోతినై వెలుగును పంచుతూనే ఉంటా...
కవితా చివురునై  ఎడారి వనాల్లో సైతం పల్లవిస్తా..
మూగబోయిన గుండె గుడిలో కోయిల స్వరాన్నై పాడుతా...