కలల్లో...
కనకంబెంత దొరికినా
అరక్షణంలో అదృశ్యమైనట్లే
ఎవరూ అనుభవించలేనట్లే
అలల్లో...
అందమైన నురగలెన్ని పుట్టినా
నిముషాన నీట కలిసినట్లే
అవి ఆవలితీరం చేరనట్లే
శిలల్లో...
ఎన్ని సుందర శిల్పాలున్నా
ఉలితో చెక్కనిదే రూపంలేదు
శివునిగా మారనిదే గర్భగుడిలో
ప్రతిష్టించనిదే ధూపంలేదు దీపంలేదు
ఇలలో...
ఎంత శ్రమపడి భ్రమపడి ఆశపడి
ఎన్ని సిరిసంపదలు అష్టైశ్వర్యాలు
భోగభాగ్యాలు ఆర్జించినా అంతా వ్యర్థం
అదేఅదే అర్థంకాని ఈజీవిత పరమార్ధం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి