కవిశేఖరులు కనే కమ్మనికల... (మినీ కవిత):- పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్....9110784502

ఓ కవిశేఖరులారా!
సాహితీ మిత్రులారా!
సరస్వతీ పుత్రులారా!
చిన్న విన్నపం
మనం వ్రాసేది కవిత్వం మనకోసం కాదు
పరులకోసం...పదిమంది శ్రేయస్సుకోసం
మనషుల్లో మంచి మార్పుకోసం...
కొత్త సమాజం కోసం...
కష్టపడి కవిత వ్రాస్తే
ఇంత సందేశమిస్తే
పోయేదేముంది చెప్పండి...
మనిషి మారడం తప్ప...
నవసమాజ నిర్మాణానికి
నాంది పలకడం తప్ప.... 
కవికన్న కమ్మనికల నెరవేరడం తప్ప...
కవిగా ఈ జన్మధన్యమై పోవడం తప్ప...
చరిత్రలో చిరంజీవిగా
సువర్ణాక్షరాలతో లిఖించబడడం తప్ప...
ఈ భువిలో సువర్ణశోభిత
కీర్తికిరీటాలను ఆర్జించడం తప్ప...
ప్రజలచే ప్రశంసలు పొందడం తప్ప... 
ప్రముఖుల చేతులమీదుగా
అవార్డులను రివార్డులను సన్మానాలను
సత్కారాలను అందుకోవడం తప్ప...
ఆ దివిలో ధృవతారగా
వెలుగులు విరజిమ్ముతూ ఉండడం తప్ప....
నలుగురి నాలుకలమీద నిలిచిపోవడం తప్ప...
పది మందికి ఆదర్శంగా మిగిలిపోవడం తప్ప...
--------------------------------------------------------
(ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా..)
కామెంట్‌లు