అగ్నిస్తంభం వలె ఆవిర్భవించిన
అరుణాచలేశ్వరా ఆదిదేవా
ఆది అంతములేక లింగమైవెలసిన
అర్ధనారీశ్వరా గంగాధరా
బ్రహ్మ విష్ణువు లెదుట భారిగానిలచిన
లింగావతారుడా నిఖిలేశ్వరా
హాలాహళము గ్రోలి కంఠాన నిలిపిన
హిమశైలవాస ముక్కంటి దేవా
భస్మావతార ఈ బ్రహ్మాండమంతటిని
చల్లగా జూసేటి సర్వేశ్వరా
గంగాభిషేకంతో పొంగిపోయేదేవ
మంగళాకారుడా మహదేవుడా
ఆరుద్ర నక్షత్ర సమయాన లింగమై
అవతరించితివట బోళాహరా
మాఘమాసం నీకు అత్యంత ప్రియమట
అభిషేక అర్చనకు రుద్రదేవా
మహాశివరాత్రి మహత్యమే ఇదియనుచు
శివపురాణము తెలిపె శుభప్రదముగా
జాగారమును జేసి జంగమయ్యను కొలువ
భక్తి శ్రద్ధలు కుదిరి ముక్తి దొరికేనట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి