మాతృభాషా (మమతలమ్మ పదాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432
తెలుగు భాషనె పలుకు
పలుకు తేనియ లొలుకు
ఒలుకు చున్నదె చినుకు
ఓ మమతలమ్మ

మాతృభాషను తెలుపు
ఈరోజు ఒక మలుపు
తెలుగుతో మన గెలుపు
ఓ మమతలమ్మ

మాతృభాషా దినము
ప్రతియెదన ఒక వనము
పూయించెను కవనము
ఓ మమతలమ్మ

ఉగ్గు పాలతొ నేర్చె
అమ్మ పదముతొ కూర్చె
కమ్మధనమును పేర్చె
ఓ మమతలమ్మ


తెలుగు వెలుగై పూచె
విశ్వంబులో నిలిచె
కీర్తి బాటలు వేచె
ఓ మమతలమ్మ

కమ్మనైనది తెలుగు
పురుటి గడ్డకు వెలుగు
జాతి గొప్పకు జిలుగు
ఓ మమతలమ్మ