పనిదొంగ( బాల గేయం )- మమత ఐల-హైదరాబాద్-9247593432

 అమ్మాయి ఇటురావమ్మ
చల్లచిలుకుదువు మాయమ్మ
అమ్మా! నేనురాలేను
పాఠంరాస్తు వున్నాను
రాయకుండ బడికెళ్ళానో
టీచరుగారు కొడతారు
అమ్మాయి ఇటురావమ్మ
వెన్నకాచుటకు మాయమ్మ
అమ్మానేను రాలేను
పాఠం చదువుతు వున్నాను
పాఠం నేర్చుకోకుండా
బడికి నేనువెళ్ళానంటే
టీచరు బెత్తంతీసుకొని
బడితె పూజను చేస్తారు
అమ్మాయి ఇటురావమ్మ
వెన్నతిందువు ఓయమ్మ
అమ్మా నేనొస్తున్న 
రాత, చదువు ముగిసినవి