పదసవ్వడి:-మమత ఐల-హైదరాబాద్-9247593432
కం
యెదజేరినక్షరంబులు
పదసవ్వడి నడకనేర్చి పద్యము కూర్చన్
ముదముగ నాట్యముజేయుచు
పదకవితకు నడిపెబాణి వదలకమనసా!
కం
కవితోత్సవ సందర్భము
రవితేజపు కాంతివోలె రమణీయముగన్
కవిడెందమ్మందు కలము
కువలయ గీతమ్ము పాడె కోయిల వోలెన్

 ఆ వె
కవుల పండగలకు విలువైన రోజుగా
నేటిదినముకదిలె వాటముగను
నింపుసొంపులలరె సంపెగకవితలు
మనసుపెట్టి వినుము మమతమాట
ఆ.వె
కావ్యకన్య నటన కలమందు మెరియగా
పరవశమ్మున పదబంధములను
విరుల గంధమువలె వికసించె నీరోజు
మనసుపెట్టి వినుడి మమతమాట


కామెంట్‌లు