-మమత ఐల-హైదరాబాద్-9247593432
నేటి సమాజం (కవిత)
*************************
ఉరుకలేస్తుంది నేటి సమాజం
పాలేవో నీళ్లేవో గుర్తించక
ఉరకలేస్తుంది సమాజం

నిస్వార్థమైన ప్రేమలెక్కడున్నాయి
నూటికొక్కరు తప్ప.....
స్వార్థం లేని ప్రేమకు త్యాగమధికం
ఆలోచనా శక్తికూడ అనన్యం

ఒకవైపు నుంచే ఆశించినప్రేమ 
ప్రేమ ఎలా ఔతుంది
ఆశించిన వారు సదా విజయులే
అందితే అందింది లేకపోతే లేదు
మరి నమ్మిన వారి పరిస్థితి.....
కృంగదీస్తే వారి తల్లిదండ్రుల పరిస్థితి....


అందుకే నిస్వార్థ ప్రేమకు
ఆలోచన అధికం
ప్రేమ హింసించదు చలువనిస్తుంది
ప్రేమ బలికోరదు బ్రతికిస్తుంది
సమాజానికి శ్రేయస్కరం
స్వార్థం లేని ప్రేమ
కాలరాసేకరోనా వంటిది
కఠిన స్వార్థప్రేమ