బమ్మెర పోతన (పద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432
ఆ.వె
తల్లి లక్కమాంబ తండ్రి కేసయ్యకు
చక్కనైన కొడుకు సహజకవిగ
భాగవత రచనను భక్తితో జేసెను
మనసు పెట్టి వినుము మమత మాట
ఆ.వె
దైవ భక్తి తోడ శైవుడు రచియించె
వీర భద్ర విజయ వివరమెల్ల
మధ్యతరగతి కవి పద్యాలలో దిట్ట
మనసు పెట్టి వినుము మమత మాట
కం
శివ కవనము గావించెను
కవి బమ్మెర సాంబశివుని ఘనవిజయములన్ 
కవి శ్రేష్టుండీ పోతన
వివరించెను వీరభద్ర విజయమునెల్లన్
కం
శ్రీ నాథుని సమకాలికు
డైనీకవిపోతనార్య ఢమరుక చరితన్
కూనలు చదివే విధముగ
గానామృత పద్యములను ఘనముగ వ్రాసెన్
  కం         
భాగవతము రాజడుగగ
వేగిరమే తెలిపెను కవి వివరము తోడన్
భాగవతము రామునికని
భోగిని దండకము వ్రాసె భూపాలునికై