ప్రత్యేకత (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432
సుగంధాల ద్రవ్యాలకు
దేవుని పూజలకు గాని
నోచుకోని దాననుచు
సృష్టిలోన గడ్డిపూవు
చింత చెందుచుండెను

సృష్టించిన దైవానికి
తెలియదనుకున్నదో
తనకంటూ ప్రత్యేకత
లేదని అనుకున్నదో

జనంమెచ్చు సుగంధాలు
దేవుడవి పులుమునా
తను ప్రకృతికందమని
గడ్డి పువ్వు మరిచెనా

భగవానుడు చెప్పెనా
నీవు నాకు సరిపోవని
సృష్టించిన దైవమే
చులకనగా చూసునా

పృథ్విలోన ప్రతిఒక్కటి
అందమైనదే కదా
దేనివిలువ దానిదే
అది సృష్టికి ప్రత్యేకతే