(సీస పద్యాలు)తెలంగాణ చిన్నమ్మ:-మమత ఐల-హైదరాబాద్-9247593432
సీ
మూర్తీభవించిన ముద్దుబిడ్డైతాను
       భరతసంస్కృతికిని భలమునిచ్చె
గౌరవంబులతోడ ఘనతనే సాధించి
        రాజధానినియేలె రమ్యముగను
దిల్లీని పాలించి దివిటీగ వెలిగెను
         యేడుపర్యాయాలు యెమ్ పి గాను
స్పస్టమైనగలము సమయోచనలతోడ
        నిలువుటద్దమ్ముగా నిలిచెనీమె
ఆ.వె
జనుల మేలుకోరె జననియై చిన్నమ్మ
మహిళజాతికంత మార్గమయ్యి
దివ్యమైన వనిత దివికేగె సెలవని
మనసుపెట్టి వినుము మమతమాట
సీ
తెలగాన చిన్నమ్మ దేశవ్యిదేశాల
      నడుమ సంబంధాల నడకనేర్పి
వాగ్ధాటి పటిమతో వారధైనిలిచెను
        యేమిచ్చి తీర్చేము యింతఋణము
పేరుప్రక్యాతికి పెన్నిదై నీకీర్తి
        వెలకట్టలేనట్టి విలువపొందె
సుస్మమ్మ నరుదెంచి చుక్కల్లొ నిలిచెను
       వందనంబిడుదుము వనితమీకు

ఆ.వె
ధైర్య సాహసాల ధాక్షాయినీకళ
నుట్టిపడిన తీరు కట్టుబొట్టు
నమ్మవారిరూపు నధికహుందాజూడ
మనసుపెట్టి వినుము మమతమాట