కరోనా(పద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432

కం
పట్టవశము గాకుండెను
ముట్టినచోనంటుకొనును మోముకుముసుగున్
కట్టుకొనుటయే మేలని
చిట్టావిప్పిందినేడు చిట్టికరోనా
కం
గదిలోనేనుండమనుచు
పదిలముగప్రపంచమంత పాకెకరోనా
బెదిరించుచు పోనేరక
కదిలించెనుప్రాణములను కపట కరోనా
కం
చవిజూసిరి జనులందరు
సువిశాలప్రపంచమును నశోకవనముగా
యెవరికివారేకాకని
సవినయముగదెలుపుచున్న సాక్షి కరోనా!

కం
పుట్టుకతో జీవొంటరి
గిట్టుటలోనొంటరేను కృపదేవునిదే
చుట్టముగా వచ్చెనిపుడు
మట్టినబడదోయనెంచి మౌని కరోనా!