వాడి పంచెఅంచున హంసల్
పరమాన్నపు మాటలె హింసల్
పని పాటలు లేనిఆటల్
జర నిజాలు చెపితే పరుగుల్. //జరనిజా//
పొలం గట్టు చూస్తుంది
దున్నమంటు పిలిచింది
నాగళి పట్టుకు రారా
నే సారంగదరియనువినరా //2//
//వాడి పంచె //
వాడిచేతికి ఎండి బేడీ
వాడి చూపులుచూస్తే కేడీ
వాని పొగిడ్తె చేయును దాడి
కోపంలో వీడు రౌడీ. //కోపంలో/
వీడి కుడిభుజంపై తుండు
యేస్తుంటే హుందాగుండు
వీడిమనసే పూలచెండు
ఆటకు ఇది బాగుండు //అరె ఆటకు//
సోమరితనమే వద్దు
యేటిగట్టు సరిహద్దు
నువుదున్నిన పొలమేముద్దు
నే సారంగదరియనువినరా. //నే సారంగ//
//వాడి పంచె//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి