కొన్నేళ్లు (బాలగేయం):-మమత ఐలహైదరాబాద్-9247593432
శిల్పిచేతిలో బ్రహ్మరూపము
బ్రహ్మగీతలో జనంజీవము
చెక్కినశిల్పం వెయ్యేళ్లు
మనిషి జీవితం ఎన్నేళ్లు

ఇటుక ఇటుకతో పేర్చినఇల్లు
ఆనందాల పొదరిల్లు
తరతరాలుగా మారనిఇంట్లో
బంధాలవిలువలు ఎన్నేళ్లు

వాతావరణ కాలుష్యం
కలుషితమైన ఆహారం
మందుబిల్లలతొ సహవాసం
ఆయువాయెను సగభాగం

కరోనకైన కట్టడిగాక
పుట్టుటగిట్టుట లెక్కజేయక
ఆశలసౌధం చేరేవరకు
పరుగులెత్తుదురు కొన్నేళ్లు