కరాట పోటీ లో గెలుపు ప్రేరణ(పాట):-మమత ఐల-హైదరాబాద్-9247593432
ప.
కరాట వీరుడ 
చలాకి బాలుడ
ఆగకుండ అడుగులు వేయిరా.,...
చ.1
ఉత్సాహానికి ఊపిరి నీవై
ఉజ్వల భవితకు సారధి నీవై
తడబడకుండా
పొరబడకుండా
ఆగకు ఆగకు ఆగకు.....
ఆపకు ఆపకు ఆపకు సాధన
ప.
కరాట వీరుడ
చలాకి బాలుడ
ఆగకుండ అడుగులు వేయిరా......
చ.2
ధిక్కరించరా అలుపు
ఆత్మధైర్యమే గెలుపు
పోరాట యోధునిగ నిలుపు...
ఆపకు ఆపకు ఆపకు
కీలక సాధన నాపకు
విజయం నీదేర!
ప.
కరాట వీరుడ
చలాకి బాలుడ
నీకు సాటి ఇంకెవ్వరురా......