పద్యాలు(అంశం:-- పనిని బట్టి ఫలితం)మమత ఐల-హైదరాబాద్-9247593432

కం
బలమైన విత్తనంబుకు
మొలకెంతో దృఢముతోడ మొలచుటె గాకన్
ఫలములు నిండుగ నొసగును
ఫలితము మన పనిని బట్టె పౌరుడ వినుమా!

ఆ.వె
బలము కలిగినిత్తు ఫలమెట్లు కాచునో
పనిని బట్టి వచ్చు ఫలితమట్లు
శక్తి కొలది ఫలము యుక్తితో చేయుము
మనసు పెట్టి వినుము మమత మాట

అంశం:-- ఆకర్షణ
కం
ఆకర్షించును దీపము 
పోకడ లెన్నెన్నొ పుట్టి పురుగుల; వోలెన్
నాకర్షణలో మునగకు
నీకున్న విచక్షణ విడ నేర్వకు మనసా!

కం
దీపాన్నాకర్షించిన 
దీపపురుగువలె మనుజులు తిరిగిన మాడ్చన్
పాపాలీ విధమందురు
రూపు విచక్షణను వీడి లోబడకెపుడున్

అంశం:-- విమర్శలు
కం
నిగ్రహమిడువక దాటుము
విగ్రహమై నాదరించ విపులవిమర్శల్
సుగ్రీవుడి బలము కలిగి
సుగ్రామము పలుకులన్ని శుభమై కూరున్

కం
పదునుగ పరిశీలించుము
యెదురైన విమర్శలెపుడు హితమే కలుగున్
బెదరక నాహ్వానించుము
పదపదముల పలుకులన్ని పరిశీలనతో