తేనెలొలుకు తెలుగు (బాలగేయం):--మమత ఐల-హైదరాబాద్-9247593432
 అమ్మ ప్రేమంత అమృతమ్ముగా
    అద్భుతమైనది మనతెలుగు
సోమనాథుని కావ్యఖండముగ
    కమ్మనైనది మనతెలుగు
బమ్మెర పోతన భక్తి రచనగా
    బంగరు భాష మనతెలుగు
నవరసమ్ములొలికించు విధముగా
    రక్తి చెందిన మన తెలుగు
ఆట వెలదిలో అలంకారముగ
    అందమైనది మనతెలుగు
సుస్వరాలు వినిపించు వీణగా
    సుధకురిపించును మన తెలుగు
రాగము లో అనురాగ గానముగ
    రమ్యమైనది మన తెలుగు
ప్రాస యాసలో వీనుల విందుగ
    పలుకబడినదే మన తెలుగు
కృష్ణ రాయలు దండిగ మెచ్చిన
    దిట్ట కలిగినది మన తెలుగు
మాటలనే పూబాటలు చేసి
    మన్నన పొందినదీ తెలుగు