స్వాతంత్ర్య యోధులు(పద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432
 సీ.
పరదేశ పాలన బానిసత్వము జేయ
       సాయుధ సమరమ్ము సలిపిరపుడు
చందమామల వంటి  సమరయోధులు దేశ
         రక్షణంగావించ లక్ష్యమెంచి
రణమునే సాగించి తృణముగా ప్రాణాల
            నర్పించిరెందరో నాయకులుగ 
తారలై నిలిచిన ధన్యమూర్తుల వల్ల
            సామ్రాజ్య స్థాపన సాధ్యమయ్యె
ఆ.వె
ఝాన్సి నెహ్రు గాంధి చంద్రబోస్  వల్లభాయ్
తది తరాదులంత తపన తోడ
భరత మాత ముక్తి బాధ్యతై పోరాడె
మనసు పెట్టి వినుము మమత మాట
ఆ.వె
శాంతి ధర్మ దీక్ష జయభేరి మ్రోగించి
దాస్య శృంఖలాలు దాట నేర్చి
జయము తోవినబడె జనగణమన యంటు
మనసు పెట్టి వినుము మమత మాట