మహిమాన్విత (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432
మహిళకాదర్శమా
మంచు నీటి ముత్యమా
మహిమాన్విత దీపమా

కులమతాలు చెదరగొట్టి
ఆచారం పక్కకెట్టి
చైతన్యం నేర్పనట్టి
పారిజాత పుష్పమా

మానవత్వ పీఠమేసి
మహిళలకు విద్యనేర్పి
సమసమాజ పోకడలను
సవరించిన చిత్రమా

కష్టనష్టముల నోర్చి
జగతికి దివిటీగ మారి
పరులు మేలు తలచినట్టి
పారిజాత పుష్పమా

సావిత్రికి మారుపేరు
నీ శాంతికి జోహారు
నిరతము నినుగుర్తించే
భరత దేశ ముత్యమా