పల్లె పల్లేదోమాట :మమత ఐల-హైదరాబాద్-9247593432

ఊరూరుది ఓమాట
పల్లె పల్లె దోబాట
మనిషి మనిషి దోవేట

పంతాలతొ పోరాటం
మనుషులతో చెలగాటం
ఎదుకింత ఆరాటం

లేని వారిదొక గోల
ఉన్న వారిదొక లీల
సవ్యమైన బ్రతుకులకు
అంతులేని వింతగోల

మంచిలేదు చెడులేదు
మానవత్వం అసలేదు
ఎవరి గోల వారిదే
ఎవరి తపన వారిదే

చెడు వినక
చెడు అనక
నడచుటొకటె మార్గమా!

కామెంట్‌లు